పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/274

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజయనగర సామ్రాజ్యము


“పోనిమ్ము. నీతండ్రి యంగీకరించినను, అతఁడు నీకు లభించుననియు నీయం దతనికట్టి విశ్వాసముండుననియు మన ము విశ్వసించుటకుందగిన దృఢ ప్రమాణమేమి కలదు.”

'కలదు. అతఁడు నన్ను విశ్వసించును' అని తన వేలి యుంగరముం జూపెను.

ఆమెతనువు పులకించెను. కను లానంద ద్యోత కాం నిమీనముల నొనర్చుచుండెను. విలాసినీ విలాసవంతులకు బరస్పర ప్రణయ యుక్తమైన ప్రథమ సమా వేశముకంటె మఱీ సంతోషము లేదు. అది లజ్జ సమేతము. పరస్పర శరీరకంప సుకు మారము. మనోహారము! అత్యంత సుఖప్రదము. అది యా కోమలాంగుల కెన్నఁటికిని మఱుపు రాదు. చెలికత్తె చిఱు నగవు నవ్వెను.


చెలికత్తె నూర్జహాను భావముం జక్కఁగా గ్రహించెను. ఆమె తనహృత్థానమునుండి యొక చిత్ర ఫలకమును దీసి నూర్జహాను కరకమలమునం దుంచెను. ఆమెకట్లు చేయునప్పుడు చిఱునగవు దుర్ని వార్యమై మొగమునఁ దోచుచుండెను. అమె గ్రహించెను. ప్రభాకర దర్శనమునఁ గమల ముకుళమువోలె నామె ముఖము ప్రఫుల్ల భావమును వహించెను. ఆమె మనో హరుని రూప మందుఁ జేక్క (బడియుండెను. కవులును జిత్రకారులును సమవ్యాపారముకలవారు. ఇరువురును మనోహర వస్తుసంచయములంజూచి లోకరంజ