పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/276

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముప్పదిమూఁడవ ప్రకరణము


మాస్ట

సంధి నడచుచుండెను. ఇరుపక్షముల వారును గృష్ణకు రెండు ప్రక్కలనుండిరి. యుద్ధ చిహ్నము లేవియుఁ గన్పట్టుట లేదు. అందజును సంధియగునని తలఁచుచుండిరి. తురకలు మాత్రము హిందువులవలె ప్రమత్తులై యుండ లేదు. ఎప్పుడు వచ్చి శత్రువులు మీఁదఁబడుదు రోయని సిద్ధముగా నుండిరి. హిందువులు సంధియగును గదాయని చూచుచుండిరి. నాఁటిరాత్రి రామరాజాదులు యోజించినట్లు మఱు నాఁడు మహాసభ కావింపఁబడెను. సామాజ్యమునందుఁ బ్ర సిద్ధింగాంచిన యెల్ల వారును విచ్చేసిరి. నాఁటిరాత్రి వారు తల పోసిన మూఁడు షరతులను నేక గ్రీవముగాఁ బ్రజలు, రాజులు, మంత్రులు, యోధులు, అందఱు నొప్పుకొనిరి. అందుచే నవా బుల కిట్లు వర్తమానమంపిరి.

“మీరు కోరిన షరతులలో నీ మార్పు లంగీకరింప వల యును. లేనియెడల మాకంగీకారము కాదు.

(1) యుద్ధ పుఖర్చులు మారు మూఁడుకోట్ల నిత్తు మన్నారు. అది చాలదు. అయిదుకోట్లుగా దానిని మార్పదల