పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/272

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

252

విజయనగర సామ్రాజ్యము


. ‘మతాంతరులైన నేమి ? మన తురుష్కులు కొందఱు రాజపుత్రాగంనలం బెండ్లియాడుట లేదా? నిన్న నేకదా అక్బరు రాజపుత్ర స్త్రీని బెండ్లియాడినది? మనతురుష్క సేనాధిపతి పుత్రిక యొకతే రాజపుత్రుం బెండ్లియాడ లేదా? మతము నకు కొద్దివారైన నేమి? గొప్పవారైననేమి ?


"మీతండ్రిగారి కిది సమ్మతము కావలదా! నిన్ను మీ తండ్రిగారు సేనాధిపతియగు మిర్జకుం 'బెండ్లి చేయ నిశ్చయించు చున్నారు. "

'త్రికరణశుద్ధిగా నేనతనిని నలచితిని. మఱియొకని నెట్లు పెండ్లియాడుదును ! స్త్రీలు మనోవాక్కాయ కర్మల నొకనినే వరింపవలయునని మసశాస్త్రములు చెప్పుట లేదా? మనసా నమ్మినవారిని విడిచి వేటొక నింజేపట్టుటయు స్తోమ సాధ్వీ లక్షణమగునా ?

'స్త్రీలు స్వతంత్రురాండ్రు కారు. నీతండ్రియిష్టము కాని యొకని వరించుటకును, ఇంకొకని వరియింపకుండుటకును నీ యిష్ట మేమున్నది? నీతండ్రి మీర్జకుం 'బెండ్లి చేయఁబూని యుం డఁగా ఆయన నాపూన్కి నుండి యెట్లు మరల్చి నీమనోరధమును సంపూర్తి చేసికొనఁగల్గుదువు ? ”

'నాకట్టిసంబంధము వలదని నానిశ్చి తాభిప్రాయమును జనకునకుని వేదింతునా? "