పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/273

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముప్పది రెండవ ప్రకరణము


“నీవు నివేదింతువే యనుకొమ్ము. అతఁడు దాని కెన్న టికి నంగీకరింపఁడు. అపుడు నీవేమి చేయఁగలవు ! ఇట్టియన ర్హాభిప్రాయముంబూని నందుచే నీకుఁగల్గు లాభము సున్న. అది యెప్పటికిని నెర వేరదు. పైన జననీజనకులకుం గష్టము సంభవిం, చును సుమా!


'ఎన్ని కష్టములు వచ్చినను నానిశ్చితాభి ప్రాయమును నేను వదలఁజాలను. ప్రాణయులున్న నేనామహామహుని కరముంబట్టి సర్వసౌఖ్యముల నందఁగల్గుదును. లేనినాఁడు తృణమువలె నెంచి ప్రాణమును విసర్జింప నెంచితిని. అంతేకాని తదర్పితమగు నీతను వును నన్యుడెవఁడును తాకఁజాలఁడుసుమీ!'

ఆపెపొడవగు నల్ల నికన్నులనుండి బొష్పములు స్రవింపఁ దొడంగెను. స్వరముమారెను. ఆమె మరల గద్గతికతో మెల్లగా నిట్లనెను.

“అయినను, నా జన్మ మధ్యమున తదీయసుకుమార కరస్పర్శ భాగ్యము చేకూరదు. విచారనిలయమై, నిరంతరపు స్రవద్భాష్పసమేత నేత్రయుగ్మమై నా యీజన్మమిట్లు కృశింప వలసినదే సుమీ!

చెలికత్తెయు నామాట లాలకించెను. ఒడలు పుల కించెను. , ఆమెకును గనుల నుండి వర్షధార లుపక్రమించెను. కాని యామె వానిని నివారించెను.