పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/271

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముప్పది రెండవ ప్రకరణము

251



“ ఒక యుత్తమాశ్వమునెక్కి సర్వసౌందర్య మూర్తి యగు నొక రాజపుత్రుఁడౌ మార్గమున రాలేదా? '

“ నాకా విషయమేమో అంతగా జ్ఞప్తిలో లేదు ”

జ్ఞప్తి లేకేమి ! నీ విట్లన లేదా? ' ఆహా ! చెలీ ! చూచి దివ్యసుందర విగ్రహమును ? ఎంత మనోహరముగా నున్నది! కాని యది నిష్ప్రయోజనము సుమీ ! అతఁడు హిం దువుఁడై నాఁడు. తురుష్క యౌవనుఁడైన నెంత బాగుండును!"

'ఆఁ! స్మృతికి వచ్చినది.

ఇరువురును గొంచెము సేపూరకుండిరి.

"అతనియందు నీ మనము లగ్నమైనదా యేమి? "

అవునని తలయూచెను.

చెలీ ! ఈ కోరిక నీకెట్లు లభ్యమౌను ! అతఁడు రాజ కుమారుఁడుగదా ! వారు తురుష్కులను ద్వేషింతురు. అతఁ డు నీయండు నీవ లెనే అనుర క్తుఁడయినంగదా నీకోర్కె సిద్ధించుట! సహజతురుష్క. ద్వేషి.యగు రాజపుత్రుఁడెట్లు నీయందు మక్కువ వహింపఁగలఁడు ? ”

“ అది నేగ్రహించితిని. అతఁడు నాయందుఁ బ్రేమ వహింపకపోలేదు.”

చెలీ ! అయినను ఇది యెట్లు సిద్ధించును? మీరు మతాంతరులుగదా.”