పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

8

విజయనగర సామ్రాజ్యము


బుద్ధి : కార్యములు నూతన పక్కింట్రొక్కుచున్నవి. ఆదిల్ శాహా రాక విశేష మగుచున్నది. అతఁడు పయోముఖవిష కుంభము. గోముఖ వ్యాఘ్రము. అతని వర్తనము నుదార స్వభావుఁడగు రామరా జేమి తెలిసికొనును ! తిరుమల రాయలును వేంకటాద్రియు 'యథారాజా తథా ప్రజాః' అన్న సామెత ననుక రించుచున్నారు. మఱియు వారిరువురు నిపు డిచట లేరు. పాపము ! నిష్కపటులగు వారి హృదయ మునకుఁ గపటియగు నాదిల్ శాహా స్వభావ మెట్లు బోధ పడగలదు?

శ్రీధ : తురకలకు హిందువులన్నఁ దలనొప్పి. అట్టియెడ నిట్టి గండ్రగొడలిని దెచ్చుకొని కంఠము పై ఁ బెట్టుకొన్న విజయ నగర సామ్రాజ్య భవిష్యత్తు చెప్పుట సుకరముగాదు. ప్రకృతము చెప్పుము. అతఁడిపుడేమి చేయుచున్నాఁడు?

బుద్ధి:- కార్యనిర్వహణమున నతనికీఁడు వచ్చువాఁడు మఱొకఁడు లేఁడు. అతని దూరదృష్టి, వివేచనాశక్తి, సంస్తుతి పాత్రములు ! అతఁడిపుడు రాజుగారి సహాయమంత్రియగు చక్రధరుని దనవలలో వేసికొనియున్నాఁడు

శ్రీధరుని హృదయము కలఁగఁజొచ్చెను. అతనికన్నులు చింతనిప్పులవలెఁ బ్రకాశించుచుండెను. అతని మొగము తీక్ష భావ మండిత మై చూచుటకు భయంకరముగనుండెను. అంత డిటనెను..