పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మొదటి ప్రకరణము

7


జక్రవర్తి రామరాజు. పేరునకు సదాశివరాయలున్నను, సర్వ విషయములందును రామరాజే చక్రవర్తియై కార్యముల నిర్వ హించుచుండెను. 'ఈ విజయనగర సామ్రాజ్యమునకు నుత్తర మున సరిహద్దుగా .విజాపుర మను రాజ్యముండెను. ఆ రాజ్య మునకుఁ బ్రభువులు తురుష్కులు. ప్రస్తుతపు నవాబు పేరు అలీ ఆదిల్ శాహా. ఇతని తండ్రి పేరు ఇబ్రహీం అదిల్ శాహా. వీరిరు వురును విజయనగర సామ్రాజ్య చక్రవర్తులతో స్నేహమున మెలంగుచుండిరి.

తండ్రియగు నిబ్రహీం ఆదిల్ శాహా చనిపోవఁగా నె కొడుకు అలీ ఆదిల్ శాహా' నవాబాయెను. పిదపఁగొలఁది కాలమునకు మన విజయనగర సామ్రాజ్య చక్రవర్తియగు రామ రాజు కొడుకు గతించెను. అపు డాదిల్ శాహా పరామర్శింప వచ్చి తన్నే ఆ చనిపోయిన కుమారునిగాఁ జూచుకొమ్మని ప్రార్థంప రామ రాజందు కంగీకరించెను. నాటినుండి యదిల్ శాహ రామ రాజును “దండ్రీ' యని పిలుచుచుండు వాఁడు. రామరాజు భార్యయు నాదిల్ శాహాను 'పుత్రికా ' యని పిలుచుచుండెడిది. ఇట్లు మన విజయనగర చక్రవర్తి కపూర్వ పుత్త్ర రత్న మొకఁడు గలిగెను.

ఆ పుత్త్రరత్న ముంగూర్చియే శ్రీధరుఁడు నిట్టూర్పు విడిచి యతనిం బుత్త్ర ప్రేమతోఁజూచుచు నమ్మియున్నందు లకు రామ రాజును నిందించినాఁడు.