పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మొదటి ప్రకరణము

9


"ఓరీ ! చక్రధరా ! మహాపాతకా ! తుచ్ఛ ధనమున కును, తుచ్ఛభోగములకును, ఆశపడి సుప్రసిద్ధాంధ్ర సామ్రా జ్యమును నశింపఁ జేయ సమకట్టితివా ! నిన్నుఁ గాకులకును, గ్రద్దలకును జిన్ని చిన్ని ఖండములుగాఁ గోసి వేసినను బాపము రాదు."

బుద్ధి:-అతఁడిప్పుడు తనతోఁ గొందఱు నితరులను జేర్చుకొని

శ్రీధ:-చక్రధరునకు ఆదిల్ శాహా యేమిచ్చెదనని యాశ పెట్టెనో?

బుద్ధి : అర్థ రాజ్యము నిచ్చెదనని యనెనఁట.

శ్రీధ : తరువాత.

బుద్ధి : అతఁ డితరులంగూడఁ దనలోఁ జేర్చుకొనుచున్నాడు. సేనాధిపులలోఁ గొంద రతనికు మనలంబింతురని వినికి.

శ్రీధర :-సరే! ఇపుడు వా రేమి సేయుచున్నారు ?

బుద్ధి: క్రమక్రమముగా 'రాజునకు రాజ్యపుంబిచ్చి యెప్పించి గోల్కొండ మొదలగు తురుష్క రాజుల నోడించుటకు దాముసాయపడెదమనియు, విజయనగర సామ్రాజ్యమును బెంపు చేయవచ్చుననియు, నాశలు కల్గించి యతనిని యుద్ధ ప్రియునిగావించి యున్నారు. అతఁడు, తమ్ములునుగూడఁగ్రమ క్రమముగా నాదిల్ శాహా చేతిలోని కీలు బొమ్మలైనారు ! రాజ్య లక్ష్మీలోలురకును, స్త్రీలోలురకును, మంచి చెడుగులు తెలియవుగదా?