పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/268

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

248

విజయనగర సామ్రాజ్యము



లను జాపల్య మలంకరించుచుండెను.ఆమె యిటు నటుఁ జూచుచుండెను. ఆసుందర విగ్రహ మెవరికొఱకో యెదురు చూచుచున్నట్లున్నది. ఆమె యే గోల్కొండ నవాబుకూతరు నూరహాను.


అంతలో నచ్చటికి మఱియొక సుందరి వచ్చెను. ఆమె చెలికత్తియ. ఆమె యందు నూర్జహానునకుం బ్రీతివిస్తారము. ఆమెయు నూర్జహానుం బ్రేమించెను. ఆమె తనశీతలహస్తమును నూర్జహాను కరమున నుంచి తాకి చూచెను.అది వెచ్చగానెను. నుండెను. ఆమె యిట్లనెను.


చెలి.. అమ్మా ! నూర్జహానూ ! నీకీ జ్వరము ప్రతిదినము హెచ్చుచున్నది గాని తగ్గుట లేదు. ముఖపద్మము వాఁడి నది. నానాటికి దేహము కృశించిపోవుచున్నది. కనులు లోనికింబోవుచున్నవి. నిన్ను జూచిన భయమెత్తుచున్నది. తండ్రిగారు నీమీఁది ప్రేమ చేత నేకదా నిన్ను విడిచి రాలేక యుద్ధమునకు నిన్ను గూడఁ దీసికొని వచ్చినారు ! నాకిది సామాన్యమగు జ్వరమువలెఁ దోఁచుట లేదు. జ్వరము కెన్ని సార్లు రాలేదు . ఒకటి రెండు దినములకంటె హెచ్చు దినము లుండునది కాదు. అదియునుంగాక నీ మన సెప్పుడును విచారమగ్నమై యేదో యాలోచించుచున్నట్లుండును. దానికిం గారణమేమి ? మితల్లిదండ్రు లనవరతముం జిం తిలుచున్నారు. ఎంతమంది వైద్యు లెన్ని చికిత్సలం జేసి