పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/269

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముప్పది రెండవ ప్రకరణము

249


వారణ నను వ్యాధి నానాఁటికి హెచ్చుచున్నది కాని తగ్గుట లేదు. ఇడియంతయుఁ జూడ నీకిది యేదేని చింతవలనం గల్గినదని తోఁచుచున్నది. వలయు నేని ప్రాణములంగూడ నీ కోఱ కీయ సిద్ధముగా నున్న మావంటి చెలులకుఁ గారణ మేమో నివేదింపరాదా? అడుగవలయునని చూచితినిగాని సమ యము చిక్కినది కాదు. అంతయు నివేదింపుము. మావంటి చెలికత్తెల యెడ దాచినఁ బ్రయోజనము కలుగదు. నల్ల రేకుల చక్కందనము నెక సక్కెము లాడుచున్న యామెకన్నుల బాష్పములుగ్రమ్మెను. ముత్యములుధారగాఁ గురియుచున్ననోయన నవి బిందువులుగా భూమిమీఁదఁ బడు చుండెను. ఒక నిట్టూర్పు వెడలెను.


“చెలీ ! నేను నీకడ నే మేని దాఁచి యెఱుఁగుదునా? '

'నేఁటివఱకును లేదు. కాని యిది యొకటిమాత్రము '

'అవును. నిశ్చయముగా నాకోర్కె చెప్పఁదగినది కాదు.

అది చెప్పి ప్రయోజనము లేదు. అది నాకీ జన్మమధ్యమునఁ దీరునది కాదు. రిత్తకోరికలం జెప్పి నిన్ను గష్టపఱచు బేలయని భావించి యూరకుంటిని '

  • చెలీ ! అట్లనకుము. నా యావచ్ఛక్తిని వినియోగించి

చూచెదను. ప్రయత్నించినచో సాధ్యపడని దేదియు లేదు. అంతచేతగాని దాననైన నీతోఁగూడ దుఃఖమును సమముగాఁ బరిచుకొని యైన ననుభవింతును '