పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/267

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముప్పది రెండవ ప్రకరణము


నూ సూర్జహా ను

స్వాభావికముగా వినిర్మలమై నీల కాంతులను గ్రమ్ము చుండు నాకసమిపుడు సంజయతిక్రమింపఁగా వ్యాపించుచున్న చీకట్లచే నల్ల ముఖ్ మల్ గుడ్లవలెఁ బ్రకాశించుచుండెను. కాలపుంజిత్రకారుఁ డాగామి రాజ హృదయ రంజనార్థంబు చిత్రించిన చిత్ర విచిత్ర కుసుమంబులోయన, ఆకసవుందివాసి యందు నక్షత్రములు మనోహరములై నెలయుచుండెను. ఇట్టియెడఁ దురకననాబుల యుద్ధ శిబిరములలో నొక్క యెడ నొక దివ్య సుందరి కూర్చుండియుండెను. ఆమె కూర్చుండి యున్న ఆ శిబిరము గోల్కొండనవాబు నంతఃపుర విహార మందిరము. ఆమె మొగము సౌందర్యవిలాసమునకును, సిరికిని దావు. ఆమె కనులు నల్లనై అతిమనోహరము లై పొడవుగా నుండెను.

ఆమె దేనినో యోజించుచున్నట్లుండెను. ఆమె ముఖము కృశించియుండెను. తనువును గృశించియుండెను. ఆమె ముఖ మునుండి వెచ్చని నిట్టూర్పు లప్పుడప్పుడు వచ్చుచుండెను. ఆమె కచ్చటఁ జీకాకుగా నుండినట్లుండెను. ఆమె వాల్లను