పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/244

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

226

విజయనగర సామ్రాజ్యము


కల్గినను మన సైన్యములు సర్వనాశము పొందకపూర్వ మడి సిద్ధింపదు. కనుక మనము నారిని మోసము చేతనే జయింప వలయును. అప్పుడు మనపక్షము విశేషించి నష్టము కాదు. శత్రువులను నాశము చేయవచ్చును. శత్రువులను, "కాఫరులను జంపునపు డిట్టి మోసములు చేయుట జాస్త్ర సమ్మతమే. దీనినే మన పెద్దలు పెక్కు యుద్ధములో ననుగ్గదించి యున్నారు.

“ అవును. మీరన్న దంతయు సత్యము. వారి శౌర్యమును, పరాక్రమమును వినుటమాత్రమే కాదు, గనియుంటిని. నారా జ్యములోని ఘాన్ పురము, పానగల్లు దుర్గములను స్వాధీనము చేసికొనునప్పుడు వారు చూపించిన సాహసము పరాక్రమము వర్ణింప నలవికాదు. తమరన్న దంతయు సత్యము. వారుయుద్ధ ముచేయు చున్నప్పుడా సామర్థ్యము విజృంబణము చూడవలసి నదేగాని వర్ణింపరాదు. సము, యుద్ధమున మన సైనికులు వారికి రెండు రెట్లున్నను గెల్వజాలరు అని. గోల్కొం నవాబు మెల్లగా ఉప్పును

“ సత్యమే. 'నేనెరుగుదును. అందలి కమ్మ సేనానుల పరాక్రమము చూచినను,వెలమ వీరులయత్యద్భుత సాహ ముంజూచినను, "రెడ్డి యోధుల శక్తి పీక్షించినసు గుండెలు పగిలి పోవును' అని అహమ్మదనగరు నవాబు వ్రాక్కుచ్చెను.

“ఏదే నొక వెఱవు యోచించి శత్రువులను వంచించు .... నాకును సమ్మతమే. అందు 'కీ మేని యుపాయముంజింతం!