పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/245

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముప్పదియవ ప్రకరణము

227


యుంటి రేని సెలవిండు. శత్రువులు పరాక్రమమున మించిన పుడు యుక్తిచే జయించుట రాజులకు ధర్మమే. కమ్మవారు, వెలమలు, రెడ్లు మాత్రమేగాక ఆ దేశమున వీరవతంసములు పెక్కులుగలరు. కాపులు రాజులు వారికి దీసిపోరు. కావున శ్రీ ఆదిల్శాహాగారు సెలవిచ్చినయట్లు వారి నితరోపాయము లరసి యే యోడింపవలయును. కాఫరుల నెట్లు చంపినను మనకు దోష ము లేదు. అందును, ఈ దుర్మార్గులు మనకుఁ బెక్కపాయము లను గష్టములనుఁ గలుగఁ జేసియున్నారు. మసీదులను మన్ను చేసినారు. మతమును మారణము చేసినారు. కనుక , ఇట్టివారి నెట్లు విధ్వంసము చేసినను దైనము మెచ్చును.


గోల్కొండ :-ప్రస్తుతము కృష్ణానదిని దాటుటకు మనకు వీలు లేకుండఁ జేసినారు. దాటుటకుఁ గావలసిన సామగ్రిని, ఓడ లను పడవలను వారు వశముచేసికొన్నారు. మనకిఁక , ఆవలి నైపునకుంబోవుటకు వలనుపడదు.

బేదర్ :-కాని దీనికి మన మొక యుపాయముం బన్న వచ్చును. మన సైన్యమును రెండు పెద్ద భాగములుగను ఒక చిన్న భా గముగను విభజించి పెద్దభాగములను రెంటిని కృష్ణకు దూరముగా వారికిం గనంబడకుండ నుంచి మధ్యనుండు చిన్న భాగమును, నది పొడవున నిటునటుంద్రిప్పిన వారును దాని వెంటందిరుగుదురు. అప్పుడు కొదవ పెద్ద భాగముల నె కాయెకి కృష్ణ కావలకుం బోవఁ జేసినచో వారుపోయి పడు