పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/243

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముప్పదియవ ప్రకరణము

225



ఒకనాఁటి రాత్రి తొమ్మిది గంటలాయెను.ఆ గుడా రములో నొక విశాలమగు సుందర ప్రదేశమున నలుగురు పురు షులు నాల్గు పడక కుర్చీల పైఁ గూర్చుండియుండిరి. ఆ పడక కుర్చీలు పట్టుపఱుపులచే శోభిల్లుచుండెను. అవి సుందరతర ములును, మృదులతరములునై యుండెను. ఆనాల్గు మూర్తులును తేజస్సమన్వితములై యుండెను. ఆ నల్గురు నాల్గు రాష్ట్రములకు నవాబులు. ఒకడు గోల్కొండకు నవాబు. అతఁడు మనకుఁ బూర్వపరిచుతుఁడే. అతని పేరు కుతుబ్ శాహా. రెండవవాఁడు బేదరు దేశమునకు నవాబు. పేరు అలీ బేరద్. మూఁడవవాఁ డహమ్మద్ నగరు రాజ్యమునకు నవాబు. అతఁడు బురాక నిజాం శాహా.నాలవవాఁడు మనవిజాపురము నవాబయిన ఆదిల్శాహా.

ఇతఁడిట్లనెను. ' ప్రసిద్ధులయిన ఆంధ్రవీరులతో మనము పోరాడ జాలము.తంత్రముల మూలమునంగాక కేవలము యు ద్ధము మూలమున వారింజయించుట మిక్కిలి కష్టము. ఆంధ్ర వీరుల పరాక్రమము, శౌర్యము,వర్ణ నాతీతము. లోక ప్రసిద్ధము. యుద్ధమునకుం బ్రవేశించినప్పుడు వారికిఁ బ్రపంచము తెలి యదు. తమ్ము తాము మఱిచెదరు. శత్రువులంబట్టి యూఁచ కోత కోయుటకంటె మఱి వారి కన్యము తెలియదు. భార్య లను బిడ్డలను వారు తలంపనే తలంపరు. ఆత్మ దేశ సంరకు ణమే వారి ప్రాణము. దేశ సేవయే వారి పరమధర్మము. వీరులతో మన మెదిర్చి జయమందుట దుస్తరము. ఒక వేళ