పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/209

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇరువదియైదవ ప్రకరణము

191


ఆ నల్గురును జచ్చిన వెనుక, యీ నల్వురును చెఱువు గట్టు పైకి నెక్కిరి. అచ్చట ప్రక్షాళనాది ప్రాతః కాల క్రియలు నిర్వర్తించు కొనుటకు మిక్కిలి యనుకూలముగా నుండెనని వారందఱు దీర్మానించుకొనిరి. సుందరీమణు లొక పచ్చిక తావునం గూరుచుండిరి.

వారి మందహాసములు, వారి విలాసములు, ఆ కుయుక్తి పరుని హృదయమును నీరు జేయుచుండెను. ఎప్పు డా సుందరీ మణులు తనయంక పీఠిం గూర్చుందురా యని యతని మనస్సు త్వర పడుచుండెను.ఆ యిరువురును దన్ను ప్రేమించిరని యతండు తలంచెను.కాని యందులకు ప్రతి బంధకముగా నచ్చట, ఆభటుఁ డొకఁడు కలఁడు. అతనికి మఱొక సంకటము కూడఁగలదు. ఆ యనాగరకునకు నొక సుందరీమణి నొసంగ నతని కిష్టము లేదు. అతఁ డెప్పుడు 'తన్ను జంపి యా సుందరీ మణులం గైకొనునో యని భయము. సందేహమయ మన స్కులకుఁ బ్రపంచమంతయు సందేహమే. అంతయు భయమే. వారికి శాంతి యుండదు.ఆ భటుని హృదయముకూడ నట్లే చలించు చుండెను.వారిని విడిచి దూర మేగుట కతని కిష్టము లేదు. కాని యతని కింత సందేహము లేదు. తనకితఁడే యపాయముఁ జేయకున్న ను తాను దూరముగాఁ బోయినచో గుఱముల పై నెక్కి యా మువ్వురును బాటిపోవుదురని లోపల భయముకలదు. - అతఁడు