పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/210

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

192

విజయనగర సామ్రాజ్యము


కూడ నా సుందరుల వంక మాటిమాటికి వీక్షించుచుండెను. తనమీఁది ప్రేమచేతనే వారట్లు మందహాసములు చేయు చున్నారని యతఁడును భావింపఁ దొడంగెను. అతని మనమున కది యంతకంతకు హర్ష మును గల్గించుచుండెను. ఆభటుఁ డట్లు జగన్మోహినీ స్వర్ణ కుమారులవంకఁజూచు టకు యుక్తిపరున కసహ్యముగా నుండెను. చూడుడు ! ఒక్క నిముసములో నెట్టి విచిత్రభావము లుదయించుచున్నవో? ఆ యిరువురహృదయము లందును బరస్పర ద్వేష ముదయిం చెను. జగన్మోహినీ స్వర్ణ కుమారుల ముఖమునఁ జంతకనట్ట దేమి? విజయసింహ రాధాకుమారులను వరించిన కాంతా రత్నము లేనా వీరు ? అయినచో వారికి సంతోషముగా నున్న దేమి ? వారిముఖముల నుండి వెల్వడుచున్నయా ఆగడపు జిఱు నగవుల కేమేని యర్థముకలదా ! నిష్ప్రయోజనముగా నట్లేల నవ్వవలయును. ఆ కుయుక్తి పరుఁడా భటునివంకఁజూచి యిట్లనెను.

"ఓరీ ! భీమన్నా ! యిటు రారా ”

అయ్యా ! సిత్తం. ఎందుకుండి ? ”

' నాలుగు పల్లుతోముకొను ఫుల్లలను విజుచుకొని రారా' అతని కది యిష్టము లేదు. కాని యింతలో . నేమివచ్చు నని యతడందు కంగీకరించెను. దూర మేగుట కతనికిష్టము లేదు. నాల్గు దిశలకును దృష్టి సారించెను. ఇరునది ముప్పది గజ