పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/208

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇరువది యై ద వ ప్రకరణ ము

ప్రతి ఫలము

ఆ భటులు నల్గురును జచ్చిరి. ప్రాతఃకాల మాయెను. మందమారుతము నిర్మలముగా నున్న యాకసమున హాయిగా వీచుచుండెను. వెలుతురు కొంచె కొంచెము హెచ్చగుచుం డెను. వెన్నెల పెంపు నశించిపోయెను. మన సుందరీమణు లిరు వురును మేలి ముసుగులను సొగసుగా సవరించుకొనిరి. వారి ముఖములు సరిగాఁ గన్పడుట లేదు. కుయుక్తిపరుని కన్ను లా నారిజాతుల ముఖపద్మముల మీఁదికి స్వారి చేయుచుండెను. వారి మేలి ముసుగులనుండి యప్పుడప్పుడు నొక విధమయిన క్రొత్త మందహాసములు జనించుచుండెను. ఆ చిఱునగవుల యందుఁ "బెద్దయర్థమున్నట్లు తోచుచుండెను.కాని దానిని మనము గ్రహింపఁజాలము. ఆ కుయుక్తిపరుఁడు మాత్రము తన యందలి మోహముచే నా మందహాసము లట్లు పొరలి వచ్చు చున్న వని యనుకొను చుండెను. కామాంధులు, మోసమును గుర్తింపఁ జాలరని లోకమున వాఁడుక .అయినను సర్వత్ర కాముకులు మోసమునే కాంచుదురని సిద్ధాంతము చేసి చెప్పఁ జాలము. చెప్పిన నది కల్ల.