పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/202

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

184

విజయనగర సామ్రాజ్యము


ఈ యిద్దఱకొఱకై మాలోఁ బందొమ్మండుగురు ప్రాణ ములను విడిచిరి. న్యాయమనితోఁచిన చో నవాబు వారికి రెట్టింపుధనమును లక్ష నుండి పంచి యిప్పించునేమో. అతఁడు గ్రుడ్డిముండ కొడుకు. తనకుతోచిన దితప్ప మఱియెవఁడు చెప్పి నను వినఁడు. పోనిమ్ము,సమముగాఁ బంచియిచ్చినను నావంతు వచ్చునది నాల్గు వేలరూపాయలు. ఈ రూపాయలు శాశ్వత ములుగావు. దొంగలు దోచుకొన్నను బోవును. నా ప్రాణ మున్నంతవఱకు నాకు ధనసంపాదన కేలోటును గల్గదు. అది యుంగాక దేవుని దయవలన నాకువచ్చినలోటు లేదు. లక్షాధి కారినిగాక పోయినను తల్లిదండ్రులు గడించియిచ్చిన యాస్థి నా జన్మాంతమువఱకు సుఖ జీవనమునకుం జాలును. నాయం దీకన్యలు మిక్కిలి యాతురతతోఁ జూచుచున్నారు. నిశ్చయ ముగా నా సౌందర్యమును జూచి వారు మోహించి యుందురు. ఇంతకంటె నాకు ధన్యత కలదా ! అదిగో చూడు మాసుందరీ మణి మరల వెన్నెలలోఁ దనసుకుమారమును, మనోహర మును, అగు ముఖము నెత్తి నావంకఁ జూచుచున్నది. అట్టి సౌభాగ్యవతుల కటాక్ష. వీక్షణముల నందుటకంటె భాగ్యము నాకే జన్మమునంగలదా? ఈ సుందరీమణులకుఁ దురు ష్కులన్నం గిట్టదు. అందుచేతనే వీరు నవాబు నయినను లక్ష పెట్టుట లేదు. నన్నుం దప్పక వీరు 'పెండ్లాడి తీరుదురు. ఇట్టి యావనవతులతో సౌఖ్యము నందుటకంటె మఱి కావలసిన