పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/201

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇరువదినాలుగవ ప్రకరణ ము

మోసము

పాపము గోల్కొండభటులు కష్టపడి ముప్పాతిక భా గము మడిసి యొక భాగము మాత్రము ప్రాణావశిష్టులై స్వర్ణ కుమారీ జగన్మోహినులను వెంటఁ బెట్టుకొని గోల్కొండకుఁ బ్రయాణమై పోవుచున్నారు. గుజ్జములొక దాని వెనుక నొకటి వరుసగా నడచుచుండెను. మధ్య స్వర్ణ కుమారీ జగన్మోహిను లుండిరి. ఇర్వురు వారి వెనుక ను నల్వురుముందును భటు లుండిరి. ఇంకను దెల్ల వార లేదు. వెనుక ప్రక్కనున్న వారిరువు రతి బలాఢ్యులు. మంచి నడివయస్సులో నున్న వారు. ఆభటు లెల్లరు నతి వేగముతో గుఱ్ఱములను దోలుచుండిరి. వారి కిపుడు గమ్యస్థానముం జేరవలయు ననుటకంటె మఱియొక తలఁపు లేదు. అందులోఁజివర రెండవవాఁడు యోచనాపరుఁడు. కుయు క్తికలవాఁడు. అతఁడపు డిట్లు యోచింపసాగెను. " ఇప్పుడు నేను స్వర్ణ కుమారీ జగన్మోహినులను దీసి కొనిపోయి నవాబున కిచ్చినందువలన మనకువచ్చు ఫలిత మేమి? అతఁడొక లక్ష రూపాయిల నిచ్చును.అందులో మధ్యలకులంచా సగముపోవును. ఈ కార్యమునకు వచ్చిన వారముమే మిరువదియైదు మందిమి. "