పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/203

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇరువదినాలుగవ ప్రకరణము

185


స దేమి ? ఇపుడు నవాబు నాకు నేల కెనుబది రూపాయలిచ్చును. తెలివియున్న వానికి ధనసంపాదన మొక లెక్క కాదు. ఈ యెను బదిరూపాయలను మఱియొక చోట సంపాదించుకోజాలనా ? ఎగ్జిముండా కొడుకై నను నా వెన్కనున్న యీభటుఁడు నేను జెప్పినట్లు వినును. మేమిరువురమును గలిసి యా ముందున్న నల్గురను జంపి వేసెదము. అతనికి నాల్గుసంచులు ధనమాశ పెట్టెదను.”

ముందునై పునకు దృష్టి సారించి చూచెను. ముందు భటు లు వీరివంక నేని చూడకుండఁ దమమార్గమున వడివడిగాఁ బోవుట నితఁడు కని పెట్టెను. , వెనుక భటునితో నిట్లు మెల్లగా ప్రసంగిం చెను.

" ఓరీ ! భీమన్నా'

' అయ్యా ! సిత్తం.”

మెల్లగా మాట్లాడరా పిచ్చిముండ కొడకా ! '

అతఁడు మెల్లగా నిట్లనెను.

" ఇంగ మెల్లింగా నే మాట్లాడు తాలెండి ! ముం దేం తెల్వ కట్లన్నా నుండి. సెలవియ్యండేంటో ”

“ నీకు బహుమానంవచ్చే డబ్బుకంటే రెట్టింపు నేనిచ్చి యావజ్జీవం నిన్ను నాకొల్వులో నుంచుకొ నెదను. నే నొక చిన్న సంగతి నీతోఁ జెప్పఁదలఁచుకొన్నాను. నీవుకూడ దాని కంగీకరించుదువా?"