పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/199

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇరువదిమూఁడవ ప్రకరణము

181


ఆ సుకుమార రాజకుమార ద్వయము “మాకోఱకు మీరేల దీనికొడంబడెదరు. మేనం బ్రాణము లున్నంత నజకు శత్రువులం జీల్చి చెండాడి వైచుదము ' అనిరి.

‘యుద్ధమై తేమా కేం ? సెక్తి లేదను కొన్నా రాయేం ! రాండి ! మళ్ళీ పోట్లాడదాం' అని యా భటులు తిరుగఁబడిరి. మరల యుద్ధము సంప్రాప్త మగునట్లుండెను. మఱియొక పరియాయుధములు కలియఁబోవుచుండెను. ఇరు దెసలును మరలం గలియం జొచ్చెను. వారి యాయుధములు మఱియొక్క పరి తళుక్కుమనియెను. ఆసుందరీమణుల గుండియలు కళుక్కు మనియెను. ఆయుధము లొండొంటిందాఁకి ధ్వనించు చుండెను.

గోల్కొండ వీరులారా! వలదు! వలదు! పోరాడ వలదు. ఇదిగో ! మేము మీతోడవచ్చుచున్నాము ' అని యా సుందరీ మణులనిరి. అనుచునే వారు గుఱ్ఱములను గోల్కొండ కుం ద్రిప్పిరి. అప్పుడే డెక్కలు మ్రోగుచుండెను. అవి పరుగెత్తు చుండెను. రాధాకుమారుని మొగము వర్ణనా తీతముగా నుండెను. అది యెఱ్ఱగాఁ బొద్దుగ్రుంకునప్పటి సూర్యునివలె బ్రకాశించుచుండెను. కాని తీక్షణ భావము, మధ్యాహ్నార్కతే జమును మించియుండెను. అతని పండ్ల ప్రయత్నముగా ధ్వనిం చుచుండెను.

" మా ప్రాణములుండగా మీకేమియు భయము లేదు. రండు ! రండు ! యూ రేల పోయెదరు. సాహసించి త్వరపడకుఁడు! త్వరపడకుఁడు' అని యెలుగెత్తిపిల్చెను. వెంబడించెను.