పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/198

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

180

విజయనగర సామ్రాజ్యము


ముగా లు, ఆ యున్న తవంశ సంభవులు, అందఱుఁ జావవలయునని విధి నిర్ణయమా యేమి?

ఇంతలో నిరువురు సేవకులు వడివడిగాం బరువెత్తి యశ్వముల నధిష్టించి పోరాడుచున్న యా యిరువుర సుందరీ మణులను సమీపించి ‘ ఓ రేయ్ ! పిచ్చి ముండాకొడకుల్లారా రండిరా ! జగన్మోహిణీ సొర్ణ కుమారీ యిద్దర్నీ జయించి లాక్కెల్దాం. ఇక్కడ పోట్లాడతా వున్నారు' అని కేక వేసిరి. తగినంత మంది యిటనుండి తక్కిన వారా ప్రక్కం బోయిరి. రాధా కుమారులును తక్కిన వీరులును బడుటకు సిద్ధముగా నుండిరి. వీరిఖడ్గములు వారికిఁ దగులకముం దే వారిబల్లెములు వీరింబొడిచి వైచుచుండెను.

ఆ యిరువురు సుందరీమణులును " ఆగుఁడు ! కొంచెము సేపుపఱకు యుద్ధము మానుడు. మే మొకమాట జెప్పెదము' అనిరి. ఆయిరువురు నట్లనఁగ నే గోల్కొండ భటులు తతణ మే యుద్ధమును మానిరి.

గోల్కొండ భటులారా! మీరిం కేల పోరా డెడరు ? మేమిరువురము మూతోడవచ్చెడము. యుద్ధమును మాని గోల్కొండకుం దిరిగి పోదము, పదండి. ఊరకే మీరు నాశమైన నేమి లాభము ?' అని యనిరి.

కొని రాధాకుమారుఁడు అది సరికాదు. మా ప్రాణములలో, ఊపిరి యున్నంతవఱకు మీరు పోవలదు ' అనెను. "