పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/200

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

182

విజయనగర సామ్రాజ్యము


. . అయ్యో ! ఇంత సాహసము మీకుఁదగదు ' అని యా రాజకుమారు లిద్దఱును బిగ్గజగాఁ గేకలునైచిరి.

పాపము ! అట్ల ఱుచుచు వీరెల్లరు గొంతదూరము వజకు వారిని వెంబడించిరి కాని కార్యము లేకపోయెను.

ప్రార్థించిరి, వేడిరి, బతిమాలుకొనిరి. లాభము లేకపోయెను. ఆ సుందరీమణులు పోవుచుండిరి. వారి వెంటంబడి గోల్కొండ భటులు పోవుచుండిరి. అపుడే కొంతదూరము గడచిరి. వీరు నిరాశ చేసికొనిరి.

మాకొఱకు మీ రిట్లేల చింతించెదరు ? మేము గోల్కొండకుంబోవుట మాకీష్టము. దానిని మీరు వారింప రాదు. మాయందు మాత్రము దయయుంచుఁడు.పోయి వచ్చెదము."

అని కడసారి పల్కులు వినవచ్చెను. మఱి మాటలు విన్పడ లేదు. జిచ్చవడి వీరెల్లంగొంతవఱకుఁ జూచిరి. ఇంతలో వారు దృష్టి పథమును దాటిపోయిరి. ఇంక లాభము లేదని వీరు ముందుకుఁ బ్రయాణముచేయ మొదలిడిరి. వారి ముఖములు తేజో విహీనములై యుండెను. అందుఁ బెక్కురకుఁ బెద్దగాయ ములు తగిలినవి.కొందఱు మిక్కుటమగు బాధ నందుచుం డిరి. కాని దానిని సహించుకొని గుఱ్ఱములను వడలి యా యరణ్య మధ్యమున వేగముగాఁ బోవుచుండిరి.