పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/193

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇరువది మూఁడవ ప్రకరణము

178


“ వాగక ముంగల్లే నోరుమూసు క్కూర్చో వాలా యేంటి రా నాకు తెల్వదు. దేముడు నోరిచ్చిం దెందుకు వాగ టాన్ని కాదంటా మఱి ? "

“ అదే జగన్మోవి ణై తే కాదురా! ఆళ్ళముటా అయి తే మన అద్రుట్టుం చెప్పేటందుకొ స్తందంటా వహ్వా ! బంగారం మేడలు కట్టించొచ్చురా ”

  • నీ నోటి వాక్యం సల్లంగా, అది జగన్మోవిణి ముటే

అవుతుందిరా”

" నీకింకా సం దేయంకూడా ఉందాయేంటో? అచ్చ రాల నామాట తీరంది చూడు. దేవుడు మనసూ చయుం చాలగాని యింకా ఇందులో షందేయం ఉంటందంటరా, చూడు తమాషా

ఉబలాటం పడబోకురా నాపిచ్చోడా ! మనం సం తోషిస్తే అది అస లేయెనక్కి పోతంది'

'ఆ? వీళ్లు. అచ్చమైన వీరులజాతోళ్ళు. ఆళ్ళతో గెల్చి ఆజగణ్మో విణ్ణి తీసుకొచ్చినప్పుడిమాటలు కాని యిప్పుడెందు కురా ఆ యాణంగిమాటలు. తెలివితక్కువ , నాయాళ్ళాలా '

"ఓరే గాజుల్తొడిగించుకొన్న ముండవైతే మఱనూవు పోరా యెనిక్కి. అంతేగాని యిటువంటి ఆణంగిమాటలు నా ముందాడమోకరా'

ఊఁ ! పదనీయండిరా సోది' .