పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/194

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

179

విజయనగర సామ్రాజ్యము


. అని మఱియొక సారి బెత్తములతో గుఱ్ఱములవీ ఫుల పై గట్టిగాఁ గొట్టిరి.

ఆ యాశ్వికులు సమీపించుచుండిరి. సోమ శేఖరమూ ర్తి యిట్లనెను.

“ఇఁకఁ బ్రయోజనము లేదు. మనము వారితోఁ బోరాడ కుండ గమ్యస్థాన మెట్టులును జేర లేముగదా ! నిలిచిపోరాడి వారిందోలి వేయుటయే మంచిదని తోఁచుచున్నది. ఏమందురు?”

' ఆఁ! మాకు నట్లే తోఁచుచున్నది. అయినను మఱి కొంతకాల హరణము చేయుదము '

చేసినందు వలనఁ బ్రయోజన ముండ వలయును గదా!”

“ మఱి కొంచెము కాలము గడచినను మనకు సాయము వచ్చువారెవరు ? ఎట్లేని మనను మనమే కాపాడు కోవలయును గదా ! ఎందుకీ యాలస్యము ? ”

రాధాకుమారా ! నీ యాయుధములం దీసి సిద్ధము చేయుము. మహారాష్ట్ర వీరులారా ! సిద్ధ పడుఁడు '

  • ఓ ! మే మెల్ల రము నీదివఱకే సంసిద్ధులమైతిమి '

" అదిగో ! వారిపుడు, మనలను మిక్కిలి సమిపించినారు?”

“ వారుకూడ మనవలెనే ఆయుధములను దీసికొని సం సిద్ధమగుచున్నారు. చూచితిరా ? ”

'ఆఁ ! పరవా లేదు. దూరమున కెంతో నుంది యున్నట్లు కన్పట్టినది కాని మన మను కొన్నంతమంది లేరు ” " .