పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/192

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

178

విజయనగర సామ్రాజ్యము


ఇంతలో దూరమునుండీ గుఱ్ఱములచప్పుడు వినవచ్చు చుండెను. అది మఱింతస్ఫుటమై కొందఱా శ్వికులు తమ్ములను సమీపించుచున్నట్లు వారికిం గోచరించు చుండెను. గుఱ్ఱముల కళ్లెములను సంపూర్తిగా విడిచిరి.

అడ్డమువచ్చిన సర్వమును దాటుచు నవి పరుగెత్తుచుం డెను. కాని యా యాశ్వికులంత కంతకు సమీపించు చుండిరి. వారిది వఱుకు వీరింజూడ లేదేమో కాని యిపుడు మాత్ర ము చూచు చుండిరి. అప్పడే చంద్రోదయ మాయెను. ముం దుపోవుచున్న వారి జాడ తమకుం జిక్కుట చేతఁ గాబోలు వారి పుడు గుఱ్ఱములను మఱింత వేగముగాఁ దోలుచుండిరి.

" అదుగో రా!మనకింకా అరమైలు దూరంలో వుంటారు.?

"నీ కేం తెలుసురా! అట్లా కన్పడతా వుందిగాని అది చాలాదూరంవుంటంది. నీకనుభవం లేదు గన్కట్లంటావు. గుజాల్ని పరెగెత్తించండి. అందుకోవచ్చు '

“ పాపం వాళ్ళగుఱాలు చస్తున్నాయిరా పరుగెత్తలేక'

“ పిచ్చిముండాకొడుకంటే నీయంటోడే. నీగుఱ్ఱలొంక చూచుకో! ఏమవుతా వున్నాయో'

“ అవునురా ! బంగారమంటి నాగోడా చచ్చు కాళ్ళడ్డదిరా

" ఓరి తొత్తు కొడకల్లాల! ఎందుకురా ఊఁవాగు తారు పోనియ్యక ! మీ కేం తోఁచదల్లేవుంది ? ”