పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/187

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇరువది రెండవ ప్రకరణము

169


నకుఁ బోవుట కెవరికిని సాధ్యముకాదు. అందుచే నా దిల్ శాహా భటులా ప్రాంతమున విశేషించి కావలి కాయరు. అయినను దఱచుగా వచ్చి చూచుచుందురు.

ఆ యిరువురు పురుషులును, అట్లు పోయిపోయి, యా కొండ గుట్టలలో నొక తావునకుం జేరిరి. అచటికింబోవుటకు నూఱుచిక్కులు. మధ్య జెముడు పొదలు, రక్కసపొదలు గలవు. అందుఁ గూర సర్పములు, తేళ్ళు, మండ్రగబ్బలు, పెం జెఱులు కూడ నుండును. అడ్డమువచ్చిన దుష్ట మృగముల నెల్ల తప్పించుకొనుచు వారొక రహస్య స్థానమునకుం బోయిన తరువాత, ఆగుట్టలలో నున్న యొక పెద్ద ఱాతిని బై కి లాగిరి. అది యీవలకు వచ్చెను. వా రాబొజియలోఁ బ్రవేశించిరి. వెంట నే మజల నా ఱాతినిలోనికి లాగి యారహస్య ద్వారముం బూడ్చి వయిచిరి. ఆ కొండలోపలి కామార్గముగుండఁ గొంత దూరముపోఁగా నొక పెద్ద విశాలమైన గుహ తగిలెను. అది దాటి మఱల వారిరువురు వడివడిగా నడచుచుండిరి. రాళ్లు కాళ్ళకుఁ దగులుచుండెను. దుష్ట జంతువుల మ్రోతలు వినం బడుచుండెను. కాని వారు భయపడక పోవుచుండిరి. మఱి కొంచెము దూరము నడచు సరికి వారికా గుహ యొక్క రెండననై పు కన్పడెను. బయటికివచ్చిరి. ప్రపంచ మెల్ల .నిర్మనుష్యమైయుండెను. ఆ బయలులో నాయిద్దఱు నోకరి వెనుక నొకరు నడచుచుఁ బోవఁజొచ్చిరి. మనము చూడ