పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/186

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

168

విజయనగర సామ్రాజ్యము


“ నాకు మధ్యమధ్య కొన్ని ముక్కలు మాత్రము వినం బడ లేదు. కాని కానలసిన యంశము సర్వముం దెలిసినది '

' నే నొక్క ముక్కకూడ దిగపడకుండ వింటిని ”

  • ఈ పాపిష్టి త్రయములో నెవఁడైన గమ్యస్థానమునకు

వచ్చిన బాగుండును. ముక్కలుముక్కలుగాదరిగి భీముఁడు దుస్స సేనుని వధించినట్లు వధించి ప్రేవులు జందెములు వేసికొం దును"

  • ఈ దుర్మార్గులలో నెవరును, అచ్చటికి రారు. ఆది

ల్శాహ రేపుండఁడు గదా ! తారానాధ చక్రధరులు పిరికివారు. వారు రారు

“ అవును! నిజమేకాని క్రోధోద్రేక మిట నిపించు చున్నది”

  • క్రోధము దూరదృష్టిని నశింపఁ జేయును. దాని కేమిగాని మన
మిఁకఁబోవచ్చునని తోచుచున్నది.. ప్రపంచ మెల్లనిశ్శబ్దముగా 

నున్నది. ద్వారపాలకులు, రక్షుకులు, నెల్లరు నిద్రింతురు,

అని వారిగువురును నడువ నారంభించిరి. మొదటి యతఁడు ముందును రెండవ యతఁడు తరువాతను బోవు చుండిరి.

ఆ మందిరమునకుఁ జుట్టును,విశాలమగు నావరణకలదు. దానిలో నొక ప్రక్కకొండల గుట్టయొకటి కలదు. ఆ ప్రాంతము