పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/188

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

170

విజయనగర సామ్రాజ్యము


లేదుగాని జనులు చెప్పుకొను మాటలంబట్టి చూచినచో వీరిని యమ కింకరులతోఁ బోల్పవచ్చును. సందేహము లేదు. అట్టి నిర్జనస్థలమున నొంటరిపై ఆరాత్రి, ఆ కటిక చీఁక టిలో, ఆ విగ్రహద్వయమును నీవు సందర్శింపఁగలవా ! నీ గుండియలు పగలవా ? చూడు. వారెవరో ? వారు మన కపరి చితులు కారు. శ్రీధరుఁడు, విజయ సింహుఁడు !

నాఁడు తెల్ల వారినది. మరలఁ బొద్దుగ్రుంకెను. రాత్రి యాయెను. చెఱనుండి మంత్రియగు బుద్ధిసాగరుని విడిపించి తిమి. పాప మతనిని గోతిలోనుండి నూతిలోనికి దింపితిమి. అతఁడా శకటము నెక్కి తన్ను జంపుట కుద్దేశింపఁబడిన గమ్య స్థానమునకుం బోవుచుండెను. ఆ బండి తోలువాఁడు కాక మఱియొకఁడు బండి వెంటఁగలఁడు. ఆ బండి క్రమముగా గమ్య స్థానమును సమీపించుచుండెను. మంత్రి వెనుక ప్రక్కనుండి తొంగి చూచుచుండెను. అతఁడెవరి కొఱకేని యెదురుచూచు చున్నాఁడా యేమి ?

బండి వడివడిగాఁ బోవుచుండెను. అంతలోఁ జప్పు డొకటి వింటిమి, నీకు జ్ఞప్తియందున్నదా ! అదియేమి ?

ఆ బండి వెనుక దూరదూరముగ శ్రీధరుఁడును విజయ సింహుడును సాయుధుఁలై నిన్నటి దుస్తులనే ధరించుకొని వచ్చుచుండిరి. వారెంత జాగ్రత్తగా నడచినను రాలిన యెండు టాకులకుం దగిలి పాదములు కొద్దిపాటి చప్పుడును జేయు