పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/184

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇరువది రెండవ ప్రకరణము

ఆ చ ప్పుడే మి?

మానవుల దృష్టి. పరిమిత మైనది. అది యెంతవఱకుఁ బోవునో యంత మేరలోనుండు నంశములను మాత్రమే గ్రహిం పఁగలదు. భౌతిక ప్రపంచమున చూడఁజాలని మన దృష్టి యన్యుల హృదయములందున్న యంశములను గ్రహింపఁ జాలునా! మనచుట్టును, బంధువులు, స్నేహితులు, విరోధులు, ఉపేక్షా, భావముగలవారు పెక్కురున్నారు. కాని వారియంత రాత్మయందు వారు మనలం ప్రేమించుచున్నారో ద్వేషించు చున్నారో మనము గ్రహింప నేర్తుమా ! ఎవ్వ రెచ్చట నెందు రోజు కేవేళ నే మేమి చేయుచున్నారో పరిమితమగు దృష్టిచే మనము వాని నెల్ల గ్రహింపఁగలమా !

కొంత సేపట్లు, ఆదిల్శాహాయు, తారానాధుఁడును, చక్ర ధరుఁడును ముచ్చటించుకొనవలసిన రహస్యాంశములను శంకా రహితముగా ముచ్చటించుకొని వెళ్ళిరిగదా ? ఫిదప గొంత కాలము గడచెను. రెండు యామముల మీఁదఁ గొంచెము ప్రొద్దుపోయెను. ప్రపంచ మెల్లఁ దేహ ధన మాన ప్రాణాదు