పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/183

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇరువదియొకటవ ప్రకరణము

165


ఆ బేగము గుఱ్ఱముల నదిష్ఠించిన యా సుందరమూ ర్తుల దగ్గఱకువచ్చి గుఱ్ఱములను సమీపింపఁ జేసి వా రిరువురను గౌఁగిలించుకొని చెతియొక ముద్దిడెను.వారుల్లాస సముద్రము లను మునిగిరి. “మీకు శుభమగుంగాక' అనెను.

“అక్కా ! సెలవు దయచేయింపుఁడు ' అనిరి.

“మంచిది' అనెను.

క్రమక్రమముగా నొకరితరువాత నొకరందఱు నా బేగము నెడఁగృతజ్ఞ తను దెలియఁ జేసిరి. పరస్పర ప్రేమానుబంధ మును వీడ లేక వీడిరి. తెంప లేక తెంపిరి. అంధకార బంధు రమై ఘోరమృగ సమూహసంచార భయంకరమై నానావిధ మృగ ఘోరనిస్వనమై విపులమై, దీర్ఘమై, జనసూన్యమై, పిశాచ భూత ప్రేత, : రాక్షసాది నివాసస్థలమనందగిన యా ఘోరా రణ్యమున నారాత్రి వేళ, జిక్కువక్కుగానున్న యొక త్రోవంబట్టి వా రెల దమగుఱ్ఱముల క ళ్ళెములను సంపూర్ణముగా నదిలి వాయు వేగమును మించిన వేగముతో స్వారి చేయుచుండిరి.