పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/185

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇరువది రెండవ ప్రకరణము

167


లన్ని టిని దైవము వశముచేసి హాయిగా గాఢ నిద్ర నందు చుండెను. లోక మెల్ల నిశ్శబ్దముగా నుండెను.

అట్టితరుణమున రహస్య భవనము నానుకొయన్న యా చెట్టుమీఁద నుండి యొక మానవ విగ్రహము క్రిందికి దిగుచుండెను. అతని వెంటనే మఱియొకండు దిగుచుండెను. మొదటివాఁడు రెండవ వానికంటెఁ గొంచెము పొడవు. కాని మొ త్తము మీఁద నిరువురును బొడవైనవారే. మిక్కిలి బలా డ్యులు. వారి దేహమున కప్పుడు వారు తొడిగిన దుస్తులు తమా షాగానుండెను. వారిరువురును నల్లని పొడవైన లాగులను ధరించి యుండిరి. వారిరువురు దేహము కుసరిగా నంటుకొనియున్న నల్లని పొట్టిచేతుల చొక్కాలను ధరించిరి. వారి మొలలలో మిక్కిలి పదునైన పెద్ద బాకులుం డెను. దెబ్బలనాపు కొనుటకుం దగిన యిత రాయుధములును వారియొద్ద గలవు. వారు పాద ములకుఁ జర్మముతోఁ జేయఁబడిన క్రొత్తరకపు ముచ్చెలను ధరించియుండిరి. అవి మెత్తగా నుండి రవంతకూడ ధ్వనికా నిచ్చుట లేదు. ఆ చెట్టు, ఆకసము నొరయుచుండెను. అదియొక యడవిజాతి చెట్టు. అది గుబురుగా నుండి క్రిందినుండి చూచు వారికి అవరోధము కల్గించుచుండెను. ఆ గుబురులో మన యీ పురుషులిరువురును దాగుకొనిరి. వారు క్రిందికి దిగి యిట్లు మాటలాడు కొనిరి.