పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇరువదియొకటవ ప్రకరణము

.

వెన్నెల


ప్రపంచము మిక్కిలి చిత్రమైనది. అన్ని యాత్రలను సులభముగాఁ జేయవచ్చును. కాని యీప్రపంచయాత్రమాత్ర మత్యంతకష్ట మైనది. దానికి సమయస్ఫూర్తి, శక్తి చాతుర్యము, యుక్తి మొదలగు నద్భుతగుణములుండి యుండవలెను. మనుజుల గుణములు, స్వభానములు, నడతలు రీతులు 'పెక్కువిధములు. కొందఱు చమత్కార ప్రియులు. మఱికొం దఱు సమర్థులు. కొందఱు సమయోక్తులు చమత్కారముగా నాడుదురు. మఱికొందఱు తెల్ల మొగాలు. అతిభయంకరమై దుస్తరమైన కష్టసముద్రమును బుద్ధినౌక నెక్కి చమత్కారము గాఁదప్పించు కొనుటకు కొందఱు మిక్కిలి చతురులు. కొందఱు లేని కష్టములను, బాధలను, దెచ్చి నెత్తిపైఁ బెట్టికొని వానిని దప్పించుకొను మార్గమును గాంచలేక యామరణము వెతలం జెందు చుందురు. కొంద జబుద్ధి చతుస్సాగర పరీవృతమైన సకల భూతల పరిపాలనమును సహించి, తజ్యాంగ చక్రమును, ఎత్తులకు మాఱైత్తులొడ్డుచు నిరాఘాటముగాఁ ద్రిప్ప నేర్చును. మఱి కొందఱు స్వవ్యవహారములనే చేసికొనఁజాలరు. అట్టి