పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

160

విజయనగర సామ్రాజ్యము


.

నా రెట్టి కష్టముందప్పించుకొనఁజాలరు. కాని సప్త సముద్రము లను దెప్ప లేకుండ నీదఁ గలవారుకూడ గలరు.

అట్లు గోల్కొండ పట్టణస్థలెల్లరును జగన్మోహినీ స్వర్ణ కుమారుల కొఱకు వెదకుచుండిరి. ప్రభువులు, సేవకులు,పిల్లలు, తల్లులు, తండ్రులు, ఎల్లరును, ఆ'ప్రసంగము నే చెప్పికొనుచు నుండిరి. కాని యది యింకను బట్టణమునకు గొంతదూరముగానున్న కారాగారములకు వ్యాపింప లేదు.ఆ కారాగారములలో నొక ప్రత్యేక భవనమున నీరు వురు డంపతులుండిరి. వారితర నేరస్థులవ లెఁగాక గౌరవ ముతో జూడఁబడుచుండిరి. వారిని గావలికాయుటకు బ్రత్యేకముగా నొక తురుష్కోన్ని తో “ద్యోగియుఁ గొంత మంది భటులును నియమింపఁబడిరి. నా రెల్లరును జాగ్రత్తతో గావలి కాయుచుండిరి. రమారమి జాము ప్రొద్దుపోయెను.

అప్పుడా భవనము నైపున కొక మౌనన విగ్రహము వచ్చుచుండెను. అతని కాయము 'బలిష్ఠ మైనది. అతఁడత్యంత ధైర్యశౌర్య నిలయఁడును, పౌరుషవంతుఁడును, అయి యుండు నట్లు తోఁచుచుండెను. అతఁడొక గుర్ర ము నెక్కెను. అతని వెంట మఱియిద్ద ఱాంధ సేవకులుండిరి. వారిరువురు చెఱి యొక గుఱ్ఱమును దోలుకొనివచ్చుచుండిరి. అతను తిన్నగా నా యిరువురు సేవకులతోను, గుజములతోను, ఆ దంపతు లున్న భవనపుఁ బ్రాకార ద్వారముకడకుఁబోయి. అందుఁ జొచ్చుచుండెను. .