పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/176

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

158

విజయనగర సామ్రాజ్యము


పై జూడుఁడు. చెఱువులోఁజూడుడు' అనుచు నవాబు ఆ యా ప్రక్కలకు భటులను బంపుచుండెను.

క్రమ క్రమముగా నతనిమనసునకుఁ బిచ్చియెక్కుడగు చుండెను. ప్రాణములతో నాసుందరింబట్టి తెచ్చినవారి కొక లక్ష రూప్యముల నొసం గేదన నెను. కొందఱాశపడి దొడ్లు, దోవలు, పుట్టలు, గుట్టలు, గట్టులు శ్రమపడి వెదకుచుండిరి. రెండు యామములు గడచెను. మూఁడు గడచెను. ప్రపంచ స్మృతి యతనికి లేదు. ఆమె ప్రాణములతో దొరకునను ఆశ యతనికిం బోయెను. ఇఁక నచటనుండి కార్యము లేదని " హా ! జగన్మోహినీ ! హా ! జగన్మోహినీ ! ప్రపంచ మెల్ల నంధ కారము చేసి పోయితివా? ' అనుచు స్వభవనము వయిపునకుఁ బోవు -చుండెను.