పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇరువదియవ ప్రకరణము

155


కొనుచుండిరి. కొందఱు యౌవనులు ' చూతము రండు ' అని తోడివయసు కాండ్రను జెల్మికాండ్రను బిలిచికొని పరువు. లిడుచుండిరి. ' ఆ హా ! నవాబు మిక్కిలి పాపాత్ముఁడు. అతని వలన నే యింత కల్లెను ' అని కొందఱు దూషించు చుండిరి. కొదఱు గృహిణులు • పాపము ! తల్లిదండ్రుల కడుపులోఁ జచ్చు. వెట్టి పోయినది. నేను జూడ లేదుగాని అంతసుందరిమణి లేదట!. ఎవరి కర్మ నెవరు తప్పింపఁగలరు?' అని విచారించుచుండిరి. ఏమూలఁ జూచినను సంక్షోభమే. ఎచటఁ జూచినను గల్లంతే. ఎచ్చటఁ జూచినను, ఆసందడే. కొందఱు తలపోయువారు. కొం దఱుచింతించు వారు. కొందఱు దూషించువారు. కొందఱు పాప మనువారు. పట్టణము మూలమూలలను ' ఆత్మహత్య ఆత్మ హత్య ' అనువార్త వ్యాపిం చెను.

గోల్కొండకుఁ గొలఁదిదూరమున నొక గొప్ప చెరువు కలదు. అది పర్వతమునకును గుట్టలకును మధ్యగా నుండెను. రాజభటులెల్లరు నా వయిపునకుంబోవుచుండిరి. గొప్పగొప్ప యుద్యోగస్థులు, న్యాయమూర్తులు, పాలకులు గుఱ్ఱములనధి ష్టించి యా వయిపునకుఁబోవుచుండిరి.

ఆ చెరువుగట్టున జనసమూహము మూగెను. అది చుట్టు వయిపులకును వ్యాపించెను. అటునుండి యిటు, ఇటునుండి యటు, కదలుచుండెను. అది ప్రవహించుచున్న జనసముద్రము వలెనుండెను. రాజాగ్నపై వందలు వేలు పదివేలు కాగడాలు