పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇరువది య వ ప్రకరణ ము

నిరాశ

జగన్మోహినీ స్వర్ణ కుమారులు గోల్కొండకువచ్చి రమా రమి మాసము కావచ్చెను. వారిస్థితి యంతకంతకు దుఃఖకర ముగానుండెను. వారి కేవిధముననుఁ దప్పించుకొను నుపాయము తోఁప లేదు. మనసులకు విశ్రాంతి లేదు. దయామయురాలైన గోల్కొండననాబు పట్టమహిషియు, స్వర్ణ కుమారీ మనోహ రుఁడైన రాధాకుమారుఁడును బెక్కు విధములఁ గార్యసాధనము చేయఁ దలపోసిరి గాని యొక్కటియు వారి కే బాగుగానుండ లేదు. రేపటితో నవాబిచ్చినగడువు నెలయు నగును. అతఁడు దుష్టుఁడు. తల్లిదండ్రుల కేమేని హానికల్గించి తీరును.

ఇంకను జాము ప్రొద్దుపో లేదు. ప్రపంచ మెల్లఁ గారు చీకట్లు వ్యాపించి యుండెను. కొందఱింకను స్నానములు చేయు చుండిరి. కొందఱు పద ప్రక్షాళనముం గావించుకొని భోజనము లకు గూర్చుండిరి.మఱి కొందఱు భోజనము చేసి హాయిగాఁ జల్ల గాలిలోఁ దిరుగుచుండిరి.అట్టియెడఁ గోల్కొండనగరమున నొక గొప్పసంక్షోభము కలిగెను. ' ఆత్మహత్య ! ఆత్మహత్య ' యని బజారులలోఁ జెప్పు