పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/174

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

156

విజయనగర సామ్రాజ్యము


వచ్చి యచట యంధకారమును విచ్ఛిన్నము చేయుచుండెను. ఆ చెఱువు మిక్కిలి విస్తీర్ణ మైనది.

అచ్చటఁ జేరిన యామూకల మనము లెల్ల నాతురపడు చుండెను. కాని బ్రదికి కాని చచ్చికాని నీటిలో నెవ్వరును కాన రాలేదు. కొందఱు తెప్పలుకట్టి యా చెఱువు మధ్యకుఁ బోవు చుండిరి. వేటొక కొందఱు ప్రక్క ప్రక్కల లోఁదట్టునఁ జూచు చుండిరి. జాడయేమియుఁ గన్పడ లేదు.

కొందఱు రాజానుగ్రహా పేక్షులు " మేము చూచితిమి. ఆ వయిపుగా వచ్చె' ననుచుండిరి. మఱికొంద 'టీ వయిపుగా' ననుచుండిరి. ఇంకఁగొందఱు మఱియొక వయిపును జూపు చుం!ి. ఆ యా స్థలముల కెల్ల భటులాత్రముతోఁ బరువిడు చుండిరి. కొందఱు ఱాలుగట్టుకొని పడియుందురని భావించి దో నెల నెక్కి లోపల వాసములతో గెలఁకుచుండిరి. ఏపని వచ్చి నను దమపనిగనే భావించు నిష్కపటులగు పిల్లలు వారి వెంటఁ బరువిడుచుండిరి.

ఆ చెఱువున నొక ప్రక్క నవా బుత్త మాశ్వమొక డెక్కి యత్యంత విచార సూచకమగు మొగముతో నాతుర తతోఁ జూచుచు నేవరేమి చెప్పుదురో యని వేదనపడు చుండెను.

ఒకఁడు వచ్చి 'అయ్యా ! నేఁజూచితిని. ఇరువురు సుంద రీమణు లీవయిపుగా వచ్చిరి ' అనెను.