పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/168

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

150

విజయనగర సామ్రాజ్యము


• సోదరీ ! అక్కఱలేదు. మీ మర్యాదమాత్రమే చాలును ' అని ప్రత్యుత్తర మిచ్చెను.

“ కారణ మేమో నాకుఁ దెలియదు కాని యితనియందు నాకు సోదరప్రేమ గల్గుచున్నది. దైవము నాకిట్టిసోదరు నిచ్చి యుండక పోవుటచేఁ గాబోలు ' అని మోహిని తలఁచెను.

కొని స్వర్ణ కుమారి యాసుందరమూర్తిం గాంచినది మొద లొక నూత్న వికారమునకు లోనయ్యెను. ఆమె దృష్టి యెంత వారించినను వారక ,ఆయౌవనునిముఖారవింద సౌందర్య మును గ్రోలుచుండెను, ఎంతయత్నించినను ఆ పెహృదయ మా నూత్న వికారమునుండి మరల లేదు. ఆ సుందరీ రత్నముయొక్క వాల్చూపు లప్పుడప్పుడు నప్రయత్న మగాఁ బోయి యాయౌ వనుని స్ఫురద్రూపము నాలోకించుచునే యుండెను.

“ ఛీ! చపలహృదయమా ! ఎన్నఁడు నెఱుఁగని యిట్టి నూతన వికారమునకు లోనగుదు వేల ? " అనుకొనెను. కాని యది యంతటితో మారునా ?

ఆ యవనుని యవస్థయు నట్లేయుండెను. హృదయ మతని వశము కాకుండెను. ఆ సుందరి యొక్క తరళనయనముల సౌభాగ్యమును, గొంచెము వాడినను సంపూర్ణ శరత్సుధాకరుని సంపూర్ణముగాఁ బరాభ వముచేయఁ జాలిన యా పెముఖమును దక్క మఱియొక్క టతనికి గోచరించుట లేదు.