పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పందొమిదవ ప్రకరణము

151


ఇట్లా యిరువురు పరస్పరానురాగపాశములచే బంధింపఁ బడిరి. అందుకుఁ గారణ మేమైయుండును? అది సృష్టి విచిత్రమా! జగన్మోహిని తనలో నిట్లు తలంచెను.

"ఈతనిం జూచినప్పటినుండియు నితఁడు స్వర్ణ కుమారికి భర్తయైన బాగుండునని తోఁచుచున్నది. వీరిరువురివంకఁ జూచినచో వీరికిఁ బరస్పర ప్రేమ జనించిన ఖగపడుచున్నది. ఎనరి పేరు చెప్పినను వినని స్వర్ణ కుమారి యితని నిట్లేల ప్రేమిం చునో ??

జగన్మో:-మిమ్ములనునే నెఱుఁగకున్నను ' సోదరా ' అని పిలు చుటకు సాహసించితిని. ఇందుకు మీరు క్షమింపవలెను.

రాధా :- నేను సోదరుఁడను. నీవు సోదరివి. ఎన్నటికిని, ఈ భావమునే నాయందుంపఁ బ్రార్థించుచుంటిని.

జగన్మో :-ఈ నామాక్షరముల నెఱింగించి మాశ్రవణ ఫుట ములను బివిత్రము చేయుదురుగాత.

ఈ మాటలు విన్న తోడనే స్వర్ణకుమారి హృదయము చల్లఁబడెను. చల్లని తొల్కరి వానచే శుష్కించిన తృణములు వోలె నామె వికసించెను. చిత్త విశ్రాంతి గల్లెను. అతఁడు మెల్లగా ' రాధాకుమారుఁడు ' అని చెప్పెను.

జగన్మో: రాధాకుమారులు మీరేనా ! మీ రేదేశమో వెళ్ళి నారని చెప్పుకొన్నారు.