పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పందొమ్మిదవ ప్రకరణము

149


జగన్మోహినితోఁగూడ స్వర్ణ కుమారికిని బెండ్లి చేయవలయునని సోమ శేఖరమూర్తి తలంచెను. కాని యాపెయిష్ట పడినది కాదు. ఒక నాఁటిసాయంకాలమున నొకయౌవనుఁడు జగన్మోహినీ స్వర్ణ కుమారులున్న సౌధమువంక జూచుచు, ఆ వయిపున కే నడచుచుండెను. అతనియాకృతి మనోహరమై చూపర కెంత చూచినను,ఇంక నుజూడవలయునన్న కోర్కి గల్గించుచుండెను. అతఁ డంగ సౌష్ఠవముకలవాఁడు. వయసు రమారమి యిరువది మూఁ డేండ్లుండును. అతఁడే స్వర్ణ కుమారీ జగన్మోహినుల స్థితి గతులను గల్గొనుటకును రక్షణ చేయుటకును నవాబుచే నియో గింపఁబడిన హిందూయావనుఁడు. అతనియందు నవాబునకు మిక్కిలి నమ్మకము, ప్రేమయుఁ గలవు.

అపు డాభవనమున నెవరును లేరు. సేవకురాండ్రు తమతమ పనులు చూచుకొనుచుండిరి. కొందఱు వంటఁ జేయుచుండిరి. తదితరులు తదితర వ్యాపారములను జేయుచుండిరి. సాయం సమయమగుచుండెను. జగన్మోహినీ స్వర్ణ కుమారు లిరువురును దమ దుర్గతికిఁ జింతలుచు గూర్చుండియుండిరి. వారి కితనిరాక తెలిసియుండవచ్చును. అతఁడు వారి సమీపమున కేగెను. అతనింజూడఁగనే జగన్మోహినికి సోదర ప్రేమ జనించెను. ఆపెకు పరపురుషుని జూచినపుఁడు కల్గు స్వాభావికమయిన లజ్జ కలుగలేదు. కాని తలవంచుకొని మెల్లగా 'సోదరా ! కూ ర్చుండుఁడు' అనెను.