పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

148

విజయనగర సామ్రాజ్యము


ననుటకంటె మఱియే ప్రపంచముఁ దెలియదు. అట్టివారు నిశ్చయ ముగాఁ దారుకోరిన మత్త కాశినులయొద్దఁ బిచ్చివారివలె- కాదు బానిసీలవలెఁ జరింతురు.

కొని యీ యిరువురు సుందరీమణులును, గృష్ణపక్ష చంద్రికవలెఁ గృశించుచుండిరి. వారిముఖముల కాంతి తగ్గుచుం డెను. సంపూర్ణ వికసిత హేమకమలములవలె నున్న మొగము లిపుడు వాడిపోయినవి. నిశ్చయముగా వారు ప్రాణధారణ కొఱకు మాత్ర మప్పుడప్పు డేదో కొంచెము భక్షించుచుండిరి. సురుచిర పదార్థములు వారికి రుచించుట లేదు. విచార దేవత వారికెల్లపుడు ప్రత్యక్షునుగుచుండెను. తల్లి దండ్రుల కష్టస్థితు లను దలపోసి తనవలన నట్టికష్టములు వారికిఁగల్గె గదా యని జగన్మోహిని శోకించుచుండెను. తనవలనఁ దనసహవాసినికిం గూడఁగష్టములొడ వెనని యాపె మఱింత పొగలుచుండెను. స్వర్ణ కుమారికిఁ దల్లిదండ్రులు లేరు. చిన్నప్పుడే గతిం చిరి. అప్పటి నుండియు దయార్ద్రభావముతో జగన్మోహిని తల్లి యామెను జేర దీసి కన్న కుమార్తెనుగా భావించి యే లోటు పాటును లేకుండఁ బెంచుచుండెను. ఆమె సద్గుణవతి, సౌందర్య వతి, పరోపకారశీల. తన స్థితిగతులను జక్కఁగాఁ దెలిసికొనెను. కర్తవ్య మెఱుఁగును. తన్నుంబెంచిన జగన్మోహిని తలిదండ్రుల నే తన తలిదండ్రులనుగా భావించి పూజించుచుండెను. జగన్మో హీనికిని స్వర్ణ కుమారికిని గల ప్రేమ, స్నేహము నిరుపమానము.