పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదు నెనిమిదవ ప్రకరణము

138


ఇట్లాపె యాభవనమున సాయంతన విహారము సల్పు చుండఁగనే పొద్దుగ్రుంకెను.చీకటులు గ్రమ్మెను. ఆమె యింకను తనశుద్దాంతమునకుఁ బోవసమకట్టినది కాదు. ఇప్పటి కామె యచటికివచ్చి చాల సేపయినది. కాని ఆమె యేల యచటినుండి పోదు? ఆమె యెనరికొఱకో యెదురుచూచు చున్నట్లుండెను. అప్పుడప్పుడు పరధ్యానముగా నుండి మ త్తమధుకరములు చేయు నిస్వనములను కామినీ కింకిణీ రవములనుగా గ్రహించి యులికిపడు చుండెను.

అంతలో నొక తురష్కసుందరీ రత్నము తాను ముందు నడచుచు వెనుక వేఱొక సుమృదులాంగిని దీసికొని మెల్లగా వచ్చుచుండెను.

ఆమె యాసుందరినిజూచి “ సోదరీ! లోనికి దయచేయుము' అనెను.

ఆ మువ్వురును లోనఁ బ్రవేశించిరి. ఆమందిరమున నొక వైపుననున్న మెట్లపై నెక్కి యామందిరపుఁ పై భాగమున కరి గిరి. అది యత్యంత మనోహరముగా నలంకరింపఁబడెను. " అందు పరిమళ తైలముచే నింపఁబడిన యొక దీపము వెల్గుచుండెను. ఆ ప్రదేశమునకుఁ బోవఁగనే మనగోల్కొండ బేగము స్త్రీలోకరత్నమా' ! ఆ యాసనము పైగూర్చుండుము' అని యాపెను బ్రార్థించెను. ఆమె యాసనము నధిష్ఠించెను. ఆమె కెదురుగా నాపట్టమహిషి కూడ సమీపముగానున్న .