పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదు నె ని మిదవ ప్ర క రణ ము

ఆశ

ఇంకను సాయంకాలము కాలేదు. అరవికసించిన మల్లికా కుసుమముల సౌరభము, ముగ్ధ సుందరీ మనోహరమంద హాస పరంపరల తెఱుంగున సరసుల హృదయములను హరించు చుండెను. అతి తీక్ష్ణ కర - పరంపరలచేతఁ బ్రపంచమును గాల్చి వేసిన ప్రభాకరుండు కొంచెకొంచెము శాంతిలుచుం డెను. అతని తేజ; ప్రకరమెల్ల వయసుతోఁగూడఁ దగ్గిన ముసలి వాండ్ర పరాక్రమ మట్లు కుంచితమాయెను. ఇప్పటికి సాయం కాలపు టెండ ప్రపంచమున కెల్ల బంగారపుఁ. బూతపూయుచు మనోహర మగుచుండెను.

అట్టియెడం దన సౌధా రామమునందుఁ గల చంద్ర శిలావినిర్మిత విహారమంటపమునందు మనమిదివ జుకుఁ జూచిన గోల్కొండపట్టపు రాణి యిటునటు తిరుగుచుండెను. సమిషము నంగల కాసారముమీదుగా పూసారములు త్రావుచు ఝుమ్మ నుచుఁ గూయుచున్న మత్తభృంగముల కలమధుర రవములు కమ్మ తెమ్మరలతోఁగూడఁ గలిసికొనివచ్చి యా పె హృదయ మున కాహ్లాదమును గల్లించుచుండెను.