పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

134

విజయనగర సామ్రాజ్యము


యాసనము పైనఁ గూర్చుండెను. అమె ఱెప్పవాల్చక యీ నూత్న సుందరివంకఁ జూచుచుండెను.

ఆమె తన మేలిముసుఁగును దీసివై చెను. ఆ సర్వలోక సమ్మోహనమగు సౌందర్యవతి యెవరు ?

ఆమె జగన్మోహినియే. ఆ బేగ మాసుందరివంకఁ జూ చెను. ఆ వ్రాలినచూడ్కుల నాపె మతి మరల్చుకొన లేక పోయెను. ఆచూపు లందు లగ్నమైపోయి మఱల్ప శక్యము గాక యుండెను.

సౌందర్యము విచిత్రమయినది. అది మానవుల హృద యము నాకర్షించుచుండును. కొందఱు మొగములఁ జూడఁగనే స్వాభావికమగు హర్ష ముదయించును. అది నూతన పురుషు లకుఁ బ్రేమాను బంధముం గల్పించుటకుఁ మిక్కిలి నేర్పుతో సేవచేయును. ఆ బేగ మా సుందరీమణం జూచుచు గొంత సేపు వఱకు మాట్లాడ లేక పోయెను. స్త్రీల సౌందర్యము స్త్రీలను " బురుషుల మనోహరాకృతి పురుషులనుగూడ నొక్కొక్కప్పు డాకర్షించును.

కం|| మగవానికి మగవాఁడును
మగువకు మగువయును వలచు' మఱియేమన న
న్న గరపు రాజకుమారుల
జిగిబిగి సోయగము, చెలుల సింగారంబున్.

ఆపె తుదకుఁ బ్రయత్నము చేసి యిట్లనెను.