పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదునారవ ప్రకరణము

117


  • అది యేవిషయముంగూర్చి. ఇపుడు యుక్తమేనా?'

అతఁడు ప్రత్యుత్తరము నీయ లేదు. అతనికనులు మాత్రముస్థి మితములై యుండెను. అవి సరిగా, ఆ కారాగా రాధి పతి మొగమున నే వ్రాలెను.

' అది రహస్యమా ఏమి? ఏకాంతస్థలము కావలయునా? ఏల యట్లు నిశ్చలముగాఁ జూచుచున్నావు ? '

  • అది రహస్యము కాదు. నేను జ్యోతిషము చెప్పఁగలను'

పరిహాసమును సూచించుచు, ఆ కారాగారాధిపతి మొగమునఁజిఱునవ్వుదయించెను. అది యతఁడు చూచెను. గా రాధిపతి యిట్ల నెను.

'జ్యోతిషమునందు మాకు -నమ్మకము లేదు. జ్యోతి ష్కులు వట్టి దాంభికులు. జ్యోతిషము బూటకము. ”

“ అది మీ విజయనగర జ్యోతిషము. మా జ్యోతిష మట్టిది కాదు. "

“ మజి మీదే దేశము '

" మా దేశము పేరు నీ కేల? నీకు వలయు సంగతుల నెల్ల నడుగుము. సరిగాఁ జెప్పెదను. నాకుఁ గేరళము తెలియును”

" నీది మళయాళ దేశమా? "

“ కావచ్చును"

“ దేశ దిమ్మరులు మిక్కిలి గడుసువాండ్రు. వారితో మాటలాడుటే మిక్కిలి దుర్ల భము. అడిగిన దానికి సరిగాఁ .