పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

116

విజయనగర సామ్రాజ్యము


డొక సన్యాసి వేషమును ధరించియుండెను. అతని గడ్డమంత దీర్ఘ ముగా లేదు. అది నెఱసియు నుండ లేదు. అతని మొగము పసిమిచాయలు తేరుచుండెను. కనులు దీర్ఘములై యోచనా సర్ద తను జాటుచుండెను. ఛత్రము కలదు. హ స్తమునఁ గమం డలము శోభిల్లుచుండెను. ఆ సన్యాసికి గంజాయినిబీల్చు నల వాటున్నట్లు తోచుచుండలేదు.

అతఁ డౌపట్టణమున నచ్చటచ్చటఁ దిరిగి యచటికి వచ్చె ను. మంత్రియతని వంకఁజూచెను. అతనిమనమున నదియో తట్టెను. కాని యతఁడేమియు నన లేదు. అతని మొగమువంకఁ జూచి యాసన్యాసి చిఱునవ్వు నవ్వెను. కాని యది యితరు లకు గోచరింప లేదు.

అచట, కారాగార పాలకుఁడును, ద్వారపాలకులును, మఱికొందబు సేవకులును గలరు. కారాగార పాలకుఁడు ముం దుకువచ్చి యిట్ల నెను.

'నీ వెవరవు ? ఇచ్చట కేలవచ్చితివి! నీకిచట బిచ్చము పెట్టువా రెవరును లేరు. పొమ్ము '

“ నాకు బిచ్చము మాత్రమే ప్రధానము కాదు. మీ వంటివారి దర్శనము నాకుఁ దృప్తి నిచ్చును " "

మావలన నీ కేమి కావలయుసు ? ”

“ నా కేమియు నక్కఱ లేదు. కొంచెము. సంభాష ణము మాత్రమే " "