పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

118

విజయనగర సామ్రాజ్యము

మజి

సమాధానము చెప్పరు. భయముండదు. అట్టివారితో మాట లాడుట కష్టము' అనెను.

అది యతఁడు విన లేదు. అతఁడిట్లనెను.

“ నీకు నాల్గు సంవత్సరముల క్రింద బాముకజచినది. క్రిందఁ బెట్టిరి. మూలికాప్రయోగముచే నొక వైద్యుఁడు నిన్ను రక్షించెను "

ఆ యధిపతి, ఆశ్చర్యపూరితుఁడై పోయెను. యఁతడు మాటలాడ లేదు.

  • నీతండ్రికి నీవొక్కఁడవే కుమారుఁడవు. నీకిరువురు

సోదరీమణులున్నారు. వారికిఁ బెండ్లియైనది. కాని పాపము! చి న్నాపెమాత్రము విధవయైనది. అతని కాశ్చర్యమెక్కు డాయెను. మహాత్మా! మీరు చెప్పినదంతయు యదార్థ మే'

“నీ వీ పట్టణమున కెనిమిదామడుల దూరమునఁగల యొక చిన్న గ్రామ మునఁ దాళ్ళతోపులో నొకగృహములో వెలయు సుప్రసిద్ధు—”

అతఁ డాగుఁడని సంజ్ఞ సేసెను. ఇతఁడాగి, ఆయధికారి చెవిలో నేదియో గొణిగెను. అతడఁత్యం తా నందమున మునింగెను,

'అయ్యా! ఇది గైకొనుఁడు. మీఋణమ్మును దీర్చుటకు నే సమర్థుఁడనుగాను. ఇంతతో సంతృప్తి వహింపుఁడు' అని