పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

102

విజయనగర సామ్రాజ్యము


పక్షుల రొదయై యుండునని తీర్మానించుకొనిరి. నిశ్శంకగాఁ దమతమ త్రోవలంబట్టిరి. జగమెల్ల నాయర్ధ రాత్రమునఁ గాఱు చీకట్లు క్రమ్మెను. కాని యాచీకట్లలోఁ జక్రధరుని మొగము కళకళలాడఁజొచ్చెను. దానికిప్పుడు నూత్న వికాసము .కలినది. ఆ వికాస మతనికిఁ క్రొత్తయందముంగల్గించెను. అది నన విక సీత పద్మమువలె శోభించుచుండెను. ఆ సోయగము నాకటిక చీకటిలోఁ దారానాధుఁడు కాని యాదిల్శాహాకాని, చూడ లేదు. కాని యతఁడు తనలో.. దానిట్లనుకొనెను.

  • ఆహా ! నేటి కాలమునకు బుద్ధిసాగరుని జంపు నుపా

యముం గాంచితిని."