పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదు నాలుగవ ప్రకరణము


ర్బా విజయసింహుని వంశ మత్యంత సుప్రసిద్ధమైనది. అతని తండ్రియు , తాతయు పరువు ప్రతిష్ఠలు కల్గినవారు. వారు విజయ నగర సంస్థానమున సేనానాయకు లై కీర్తినిగాంచిరి. పౌరుష వంతులు. శౌర్యైకధనులు. స్వభావసిద్ధముగా జనుల హృదయ మునందు గౌరవభావమును నాటుచుందురు. అట్టివారు సుగు ణౌదార్యవంతులైనచో వారికిఁ గల్గునట్టి ఖ్యాతి మిక్కుట మగు చుండును. తమ్ముఁ బోషించుచున్న విజయనగర సామ్రాజ్య మునకుఁ బెక్కు విజయములను సమకూర్చి వారట్లు రాజుమన్న నలకుఁ బాత్రులయి యుండిరి.

విజయ సింహుఁడు కూడ, ఆనువంశీకముగా వచ్చు చున్న శౌర్య ధైర్య గాంభీర్యాది సద్గుణ గణములతోపా. టుద్యోగమునుగూడ నిల్పుకొని విజయనగరమునఁ బండితుల చేతను గవుల చేతను తదితర లోకము చేతను స్తుతింపఁ బడుచు నుండెను. . అతఁడు పిన్న తన మెల్లఁ దన తాతగారింట శృంగార పురమునఁ గడపెను. తరువాత విజయనగరమునకు వచ్చి కొలఁది కాలముననే రాజును దన సుగుణసంపత్తి చేతను, సాహస